Telangana | హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని సర్కారు బడులు గాడితప్పుతున్నాయి. ప్రభుత్వ అసమర్థ విధానాల కారణంగా ఆదరణ కోల్పోతున్నాయి. మూడేండ్లల్లో సర్కారు బడుల్లో 3,67,374 మంది ఎన్రోల్మెంట్ తగ్గింది. మరీ ఆందోళన కలిగించే విషయమేంటంటే సర్కారు బడుల్లో తగ్గి.. ప్రైవేట్ బడుల్లో ఎన్రోల్మెంట్ పెరగడం. రాష్ట్రంలో మొత్తం 30,137 ప్రభుత్వ బడులుండగా, 11,217 ప్రైవేట్ స్కూళ్లున్నాయి. ప్రైవేట్‌తో పోల్చితే రెండు రెట్లు అధికంగా సర్కారు బడులున్నాయి. ఎన్రోల్మెంట్ విషయానికి వస్తే సర్కారు బడుల్లో 25.13లక్షల విద్యార్థులుంటే, ప్రైవేట్‌లో 37.01లక్షల విద్యార్థులున్నారు.
5