Nagarjuna Sagar | హైదరాబాద్ : కృష్ణా నదికి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. జూరాల, శ్రీశైలం నుంచి దిగువకు కృష్ణమ్మ ఉధృతంగా ఉరకలేస్తోంది. ఈ క్రమంలో నాగార్జున సాగర్‌కు భారీగా వరద నీరు చేరుకోవడంతో.. జలాశయం నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు 16 గేట్లను 15 అడుగుల మేర, 10 గేట్లను 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
26 గేట్లు ఒకేసారి ఎత్తడంతో.. పాల పొంగులా ఎగిసిపడుతున్న జలదృశ్యాన్ని పర్యాటకులు, స్థానికులు తమ కెమెరాల్లో ఆ దృశ్యాలను బంధిస్తున్నారు. సాగర్ జలాలు దిగవకు ఉరకలేస్తున్న దృశ్యాలను చూసి మైమరిచిపోతున్నారు. ఇక ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో అధికారులు.. పర్యాటకులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.
నిండుకుండలా నాగార్జునసాగర్ జలాశయం.. డ్యాం 16 గేట్లను 15 అడుగుల మేర, 10 గేట్లను 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు pic.twitter.com/Cu1StHFZJK
— Telugu Scribe (@TeluguScribe) September 30, 2025