బూర్గంపహాడ్, జూన్ 21 : రేషన్ కార్డుకు సంబంధించి అప్లోడ్ ప్రాసెస్ కోసం ఓ టైపిస్టు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ తహసీల్ కార్యాలయంలో శనివారం చోటుచేసుకుంది.
మండలానికి చెందిన ఓ వ్యక్తి రేషన్ కార్డుకు సంబంధించి అప్లోడ్ ప్రాసెస్ కో సం బూర్గంపహాడ్ తహసీల్ కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సీహెచ్ నవక్రాంత్‌ను సంప్రదించాడు. అతడు రూ.4 వేలు డిమాండ్ చేయగా.. రూ.2,500కు ఒప్పందం కుదుర్చుకున్నారు. శనివారం కార్యాలయంలో టైపిస్టుకు రూ.2,500 లంచం ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ రమేశ్ తన బృందంతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని వరంగల్‌కు తరలించారు.