Bhadrachalam | ఖమ్మం జిల్లా వైరా పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. భద్రాచలం వెళ్తున్న ఖమ్మం బస్సును కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 25 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.