ఏమైందన్నా అంత మొసపోసుకుంట
ఉరికత్తున్నవ్.. అని
తెల్లబట్టలేస్కున్న కాంగ్రెస్ లీడర్‌ను
అడిగిండు పక్క సందుల పచారం చేస్తున్న
ఆ పార్టీ కార్యకర్త..
ఏం లేదురా తమ్మీ
గా ఇంట్ల ముసల్ది
బట్టలు ఆరెయిమని పిలిసింది..
నేను బట్టలు ఆరేసి మంచిపేరు తెచ్చుకోవచ్చని
బకీటు పట్టుకొని మేడమీదికి పొయిన
అరే.. ఒక్క దండెం లేదు ఆడ..
అవ్వా ఏడ ఆరెయ్యాలె బట్టలు అని అడిగిన..
ముసల్ది.. ముసలోడు ముల్లుకట్టె పట్టుకొని
మేడమీదికి అచ్చిన్రు..
అగో గా కరెంట్ తీగల మీద
ఆరేయ్ అని గదమాయించిన్రు..
ఏం పిచ్చిపిచ్చిగా ఉన్నదా..
నన్ను సంపాలని సూత్తున్నరా అని అడిగినా
దానికి ఆ ముసలోళ్లు మొన్న నేను
మాట్లాడిన వీడియో పెట్టిర్రు..
ఏం మాట్లాడినవే..
ఏం లేదురా భయ్.. తెలంగాణల
24 గంటల కరెంటే వస్తలేదు..
కేసీఆర్ మోసం చేస్తుండు అని అన్న
అది మదిల పెట్టుకున్న ఈ ముసలోళ్లు
కరెంటే లేదని నువ్వే చెప్పినవ్గదా..
కరెంట్ తీగల మీద బట్టలు ఆరెయ్ అని ఎంబడవడ్డరు..
ఎట్లనో అట్ల ఆల్లనుంచి తప్పించుకొని అచ్చిన..
అని ఆ లీడర్ గజగజ వణుక్కుంట చెప్పిండు..
మరి ఎందుకన్నా.. గా కరెంట్ జోలికి పోయినవ్..
తెలంగాణల ఏనాడన్నా కరెంట్ పోతున్నదా..?
గది పజలకు తెల్వదా..
లేక వాళ్లేమన్నా ఎడ్డోళ్లనుకున్నవా
మనం చెప్పే కహానీలు ఇనేతందుకు
అని ఆ చోటామోటా కార్యకర్త గూడ
ఆ నాయకుడికి మరో షాక్ ఇచ్చిండు..!!
– రాజు అతికం