దామరచర్ల, డిసెంబర్ 14 : నల్లగొండ జిల్లా దామరచర్ల ఎస్బీఐ ఏటీఎంలో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. నార్కట్‌పల్లి-అద్దంకి ప్రధాన రహదారి వెంట ఉన్న ఏటీఎంను దుండగులు పగులగొట్టి రూ. 22 లక్షల నగదును అపహరించుకుపోయారు.
షట్టర్‌ను మూసివేసి గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను కత్తిరించి చోరీకి పాల్పడ్డారు. ఆనవాళ్లు కనిపించకుండా మిషన్ మీద, సీసీకెమెరాల మీద పెప్పర్ స్ప్రే చేశారు. ఉదయాన్నే స్థానికులు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు సీసీ కెమెరాతో పాటు పరిసర దుకాణాల్లోని సీసీ పుటేజీని పరిశీలిస్తున్నారు. ఎస్పీ శరత్చంద్ర ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.