మంగళవారం 19 జనవరి 2021
Telangana - Jan 04, 2021 , 02:16:33

ప్రేమతో.. పేదల సేవలో రైల్వే

 ప్రేమతో.. పేదల సేవలో రైల్వే

హైదరాబాద్‌ సిటీబ్యూరో, జనవరి 3 (నమస్తే తెలంగాణ): ప్రేమతో.. పేదలకు సాయంచేసేందుకు దక్షిణ మధ్య రైల్వే ముందుకొచ్చింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గుంతకల్‌ రైల్వే డివిజన్‌ ‘ప్రేమతో..’ పేరిట ప్రత్యేక సేవాకేంద్రాన్ని ప్రారంభించింది. గుంతకల్‌ రైల్వేస్టేషన్‌లో దుప్పట్లను, దుస్తులను, ఇతర వస్తువులు ఉచితంగా తీసుకువెళ్లేందుకు అందుబాటులో ఉంచామని డివిజినల్‌ రైల్వే మేనేజర్‌ అలోక్‌ తివారీ తెలిపారు. ఇంకా పేదలకు అవసరమైన వస్తువులను ఇక్కడ ఉంచుతామని, అవసరమైనవారు తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు. డివిజన్‌లోని రైల్వే అధికారులు, ఉద్యోగులు తమ వంతుసాయంగా పలు రకాల వస్తువులను ఇక్కడ ఉంచారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఎస్సీఆర్‌ జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా అభినందించారు. కార్యక్రమంలో సీనియర్‌ డివిజినల్‌ మేనేజర్‌  బాల మురళీధర్‌లతో పాటు పలువురు రైల్వే అధికారులు పాల్గొన్నారు.