శనివారం 11 జూలై 2020
Telangana - Jun 02, 2020 , 21:24:10

నగరానికి వర్ష సూచన..!

నగరానికి వర్ష సూచన..!

హైదరాబాద్‌ : రాగల నాలుగు రోజులపాటు నగరంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉపరితల ద్రోణి ఆవర్తన ప్రభావం, క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావంతో వాతావరణంలో మార్పులు వచ్చి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

అందులో భాగంగానే వాతావరణంలో తేమశాతం పెరిగిందని అన్నారు. మంగళవారం నమోదైన ఉష్ణోగ్రతల విషయానికి వస్తే.. గాలిలో తేమ 55 శాతం ఉండగా, ఉష్ణోగ్రతలు గరిష్టంగా 34.5 డిగ్రీలు నమోదుకాగా, కనిష్టంగా 22.6 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.


logo