సోమవారం 01 జూన్ 2020
Telangana - May 13, 2020 , 18:43:28

మాస్కు పెట్టుకో.. దూరం ఉండు.. తాళి కట్టు...

మాస్కు పెట్టుకో.. దూరం ఉండు.. తాళి కట్టు...

కరోనా కాలంలో పెళ్లి పందిట్లో మాస్కులు, శానిటైజర్‌లు తప్పని సరిగా మారాయి. ఈ నేపధ్యంలోనే ఈ రోజు బోడుప్పల్‌ ప్రాంతంలో ఓ వివాహం ఇందుకు నిదర్శనంగా మారింది. వివాహ సమయంలో పురోహితుడితో పాటు వధువు, వరుడులతో సహా హాజరైన 30 మంది కూడా మాస్కులు ధరించి కరోనా కాలంలో పెళ్లిని నిరాడంబరంగా చేసుకున్నారు. ఈ సందర్భంగా వరుడు సాయి, వధువు రోజాలు తమ పెండ్లీ కోసం ఎంతో కలలు కన్నామని కాని ఇంత సాదాసీదాగా పెండ్లీ చేసుకోవడం తమ జీవితంలో మరువ లేని దినంగా ముద్రపడిపోయిందన్నారు. మరీ ఆశ్చర్యకరం ఏందంటే కొందరు ఫోటోలు దిగే సమయంలో కూడా మాస్కులను తీయకపోవడం వారికి ఉన్న భయం, అవగాహనకు అద్దంపడుతుంది. పందింట్లో కూడా భౌతిక దూరాన్ని పాటించారు పెళ్లింటి వారు. 


logo