LIC | న్యూఢిల్లీ, మే 10: ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఏప్రిల్ ప్రీమి యం వసూళ్లు దశాబ్దం గరిష్ఠాన్ని తాకాయి. రూ.12,383.64 కోట్లుగా నమోదయ్యాయి.
2014 నుంచి చూస్తే ఒక నెలలో ఇదే అత్యధికం. గత ఏడాది ఏప్రిల్లో రూ.5,810.10 కోట్లే. దీంతో 113.14 శాతం వృద్ధి కనిపించింది. కాగా, వ్యక్తిగత ప్రీమియంల కంటే గ్రూప్ ప్రీమియంల వాటనే ఎక్కువ.