మక్తల్, జనవరి 2 : ట్రాక్టర్ బోల్తా పడి వ్యవసాయ కూలీలకు గాయాలైన(Laborers injured) సంఘటన నారాయణపేట(Narayanpet )జిల్లాలో చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిని వివరాలు ఇలా ఉన్నాయి. మక్తల్ మండలం దాసరిదొడ్డి గ్రామానికి చెందిన ఐతు పొలంలో వరినాట్లు వేసేందుకు గురువారం ఉదయం ట్రాక్టర్లో 20 మందికిపైగా కూలీలు బయలుదేరారు. కొద్దిదూరం ప్రయణించగానే డ్రైవర్ అజాగ్రత్తతో ట్రాక్టర్ బోల్తాపడింది. దీంతో ఇరవై మందికి పైగా గాయపడ్డారు. గుర్తించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను మహబూబ్నగర్ వైద్యశాలకు తరలించారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి..
SSA Strike | వినూత్నంగా సమగ్ర శిక్ష అభియాన్ ఉపాధ్యాయుల సమ్మె..
MLC Kavitha | రేపు ఇందిరా పార్క్ వద్ద బీసీ మహాసభ : ఎమ్మెల్సీ కవిత
Rythu Bharosa | రైతు భరోసా కోసం కొత్తగా దరఖాస్తులు..! జనవరి 14 నుంచి అమలు..!!