యాదగిరిగుట్ట,యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్ట(Yadagirigutta)లో వెలసిన లక్ష్మీనారసింహస్వామి (Laxmi narasimha swamy) ని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలయాన్ని పునర్నిర్మించిన తరువాత భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతుంది.
20 రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకలను గురువారం వ్రత మండపంలో లెక్కించారు. స్వామివారి హుండీ(Hundi)కి రూ.1. 86 కోట్లు ఆదాయం(Income) వచ్చిందని ఆలయ ఈవో తెలిపారు. 241 గ్రాముల మిశ్రమ బంగారం, 4 కిలోల 650 గ్రాముల మిశ్రమవెండి కానుకల రూపేణా వచ్చిందని వెల్లడించారు. అమెరికాకు చెందిన 595 డాలర్లు, యూఏఈ కి చెందిన 665 దిరామ్స్, ఆస్ట్రేలియాకు చెందిన 305 డాలర్స్, కెనడాకు చెందిన 20 డాలర్స్, క్వార్టర్స్‌కు చెందిన 22 రియాల్స్ వచ్చిందని తెలిపారు.
నేపాల్‌కు చెందిన రూ.145 , న్యూజిలాండ్ కు చెందిన 20 డాలర్స్ , సింగపూర్‌కు చెందిన 30 డాలర్స్, కువైట్‌కు చెందిన 1/4 దీనార్, బోట్స్వానా కు చెందిన 50 పౌలా, ఈజిప్టు కు చెందిన 5 పౌండ్స్ , మలేషియాకు చెందిన ఒక రింగిట్, ఇంగ్లాండ్‌కు చెందిన 55 పౌండ్స్ హుండీకి కానుకల రూపేణా వచ్చినట్లు కార్యనిర్వహణాధికారి వెల్లడించారు.