హైదరాబాద్, జూన్ 21 (నమస్తేతెలంగాణ): తెలంగాణలో పర్యావరణహిత ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీల) సంఖ్య 2 లక్షల మైలురాయిని దాటింది. 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చి 31 ముగిసే నాటికి రవాణా శాఖ లెకల ప్రకారం రాష్ట్ర వ్యా ప్తంగా 1.96 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు నమోదయ్యాయి. ఏప్రిల్ నెలాఖరు నాటికి ఆ సంఖ్య 2 లక్షలు దాటినట్టుగా రవాణా శాఖ వర్గా లు తెలిపాయి. మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల్లో అత్యధికంగా (80 శాతానికిపైగా) ద్విచక్ర వాహనాలు ఉండగా, తర్వాతి స్థానంలో కార్లు ఉన్నారు. ఈవీలతో వాహన యజమానులతోపాటు పర్యావరణానికీ మేలు జరుగుతున్నది.
క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ-2025లో భాగంగా తెలంగాణవ్యాప్తంగా 2030 నాటికి 6,000 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలన్నదే లక్ష్యం. 2035 నాటికి ఈ సంఖ్య 12 వేలకు పెంచాలని నిర్ణయించారు. ఈ ఏడాది చివరి నాటికి చార్జింగ్ స్టేషన్ల సంఖ్యను 3,000కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.