Gold Seize | సంగారెడ్డి : జహీరాబాద్ అంతర్ రాష్ట్ర ఎక్సైజ్ చెక్ పోస్టు వద్ద భారీగా బంగారం పట్టుబడింది. చిరాగ్పల్లి ఎక్సైజ్ చెక్ పోస్టు వద్ద ఎన్ఫోర్స్మెంట్, ఎక్సైజ్ అధికారులు కలిసి శుక్రవారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఓ వాహనంలో రెండు బాక్సుల్లో తరలిస్తున్న రెండు కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
సరైన పత్రాలు లేకుండా ఈ బంగారాన్ని ముంబై నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. పట్టుబడిన బంగారం విలువ రూ. 2 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.