హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : డిగ్రీ ఫస్టియర్‌లో ఈ సారి 19వేలకు పైగా విద్యార్థులు సీట్లను కోల్పోయారు. మొదటి విడతలో సీట్లు వచ్చినా ఈ 19వేల మంది ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోవడంతో సీట్లు కోల్పోయారు. దోస్త్ మొదటి విడతలో 60,428 మందికి సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన వారంతా ఈ నెల 6లోగా ఆన్లైన్లో రిపోర్టు చేయాల్సి ఉండగా, కేవలం 41,285 మంది మాత్రమే ఆన్లైన్ సెల్ఫ్‌రిపోర్ట్ చేశారు. సెల్ఫ్‌రిపోర్ట్ చేయని వారంతా సీట్లు కోల్పోయారు. దోస్త్ రెండో విడతలో 34,276 మంది దరఖాస్తులు సమర్పించారు. మొదటి విడతతో కలిపి మొత్తంగా 46,886 మంది వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నారు. ఈనెల 13న రెండో విడత సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన వారు 13 నుంచి 19 వరకు రిపోర్టింగ్ చేయాలి.
‘గ్రూప్-3’ వెరిఫికేషన్ జూలై 8కి వాయిదా
హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-3 సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను టీజీపీఎస్సీ వాయిదావేసింది. ఈ నెల 18 నుంచి జరగాల్సిన సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను జూలై 8కి వాయిదావేసింది. అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు వాయిదావేసినట్టు కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ ప్రకనటలో తెలిపారు.
118 ఏపీపీ పోస్టుల భర్తీకి అనుమతులు
హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): ఖాళీగా ఉన్న 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్(ఏపీపీ) పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.