డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మూడో విడత సీట్లను శనివారం కేటాయించారు. ఇందులో డిగ్రీ ఫస్టియర్లో మరో 85,680 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకున్నారు.
డిగ్రీ ఫస్టియర్లో ఈ సారి 19వేలకు పైగా విద్యార్థులు సీట్లను కోల్పోయారు. మొదటి విడతలో సీట్లు వచ్చినా ఈ 19వేల మంది ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోవడంతో సీట్లు కోల్పోయారు.