హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఫైర్ కేంద్రాలను బలోపేతం చేయడంలో భాగంగా ఆర్థిక సంఘం, రాష్ట్ర ప్రభుత్వం రూ.190 కోట్ల నిధులను వెచ్చించనున్నాయి. 15వ ఆర్థిక సంఘం రూ.142.61 కోట్లు, రాష్ట్రం వాటాగా రూ.47.53 కోట్లు వెచ్చించనున్నాయి. దీనికి సంబంధించిన ఒప్పందంపై బుధవారం న్యూఢిల్లీలో ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి, ఆర్థిక సంఘం అధికారులు సంతకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త గా 18 అగ్నిమాపక కేంద్రాలను మంజూరు చేసింది. వీటికి భవనాలను నిర్మించడానికి, వాహనాలు, యం త్రాలు, పరికరాలను కొనుగోలుకు రూ.57.04 కోట్లు అవసరమవుతాయని అంచనా. 32 మీటర్లు, 104 మీటర్ల ఎత్తు ఉన్న హైడ్రాలిక్ ఫ్లాట్‌ఫాం, 68 మీటర్ల ఎైత్తెన నిచ్చెన, హై ఫైర్ ప్రెషర్ పంపులు 18, ఫైర్ వాహనాలను కొనుగోలుకు రూ.87.57 కోట్లు వ్యయం చేయనున్నారు. రాష్ట్ర కార్యాలయం, పట్టణ ఫైర్ కేంద్రాలు, కంప్యూటర్ సిస్టం అభివృద్ధికి రూ.9.50 కోట్లు, రాష్ట్రస్థాయి శిక్షణ కేంద్రానికి రూ.9.53 కోట్లను వెచ్చి స్తారు. రూ.28.52 కోట్లతో 11 ఫైర్ స్టేషన్లు, రెండు ఫైర్ భవనాలను నిర్మించనున్నారు.