తెలంగాణ అగ్నిమాపకశాఖ మరింత బలోపేతం కానున్నది. 15వ ఫైనాన్స్ కమిషన్ నుంచి రాష్ట్ర అగ్నిమాపశాఖకు రూ.190.14 కోట్లు (రాష్ట్ర వాటా రూ.47.53 కోట్లు) రానున్నాయి.
రాష్ట్రంలో ఫైర్ కేంద్రాలను బలోపేతం చేయడంలో భాగంగా ఆర్థిక సంఘం, రాష్ట్ర ప్రభుత్వం రూ.190 కోట్ల నిధులను వెచ్చించనున్నాయి. 15వ ఆర్థిక సంఘం రూ.142.61 కోట్లు, రాష్ట్రం వాటాగా రూ.47.53 కోట్లు వెచ్చించనున్నాయి.
తెలంగాణ అగ్నిమాపకశాఖకు రావాల్సిన రూ.190 కోట్ల నిధులు, వాటి ఖర్చులకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర హోం శాఖకు పంపినట్టు ఫైర్ డీజీ వై నాగిరెడ్డి గురువారం తెలిపారు.