రాష్ట్రంలో 1,804 పీఈటీ పోస్టులు ఖాళీ
ప్ర భుత్వ పాఠశాల ల్లో 1,804 పీఈ టీ పోస్టులు ఖాళీ గా ఉన్నాయని, ఆ ఉద్యోగాలను ఎందు కు భర్తీ చేయడం లేదో సీఎం రేవంత్రెడ్డి స్పష్టంచేయాలని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
- ఎందుకు భర్తీ చేయడం లేదో సీఎం రేవంత్రెడ్డి చెప్పాలి
- ఎక్స్’ వేదికగా మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి డిమాండ్
హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): ప్ర భుత్వ పాఠశాల ల్లో 1,804 పీఈ టీ పోస్టులు ఖాళీ గా ఉన్నాయని, ఆ ఉద్యోగాలను ఎందు కు భర్తీ చేయడం లేదో సీఎం రేవంత్రెడ్డి స్పష్టంచేయాలని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. సోమవా రం ఆమె ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. క్రీడాకారులైతే ఉద్యోగాలు పక్కా.. అని ఓ వైపు సీఎం అంటున్నారని, విద్యార్థు లు మంచి క్రీడాకారులు కావాలంటే పాఠశాల స్థాయి నుంచే శిక్షణ ఇవ్వాలి కదా? అని ఆమె చురకలు అంటించారు. అంతర్జాతీయ స్థాయిలో ఒకరిద్దరికి ఉ ద్యోగాలు ఇవ్వడం కాదని.. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వివిధ క్రీడల్లో రాణిస్తున్న తెలంగాణ బిడ్డలందరికీ ఉద్యోగా లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో విద్యార్థులకు రూ.8 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేయాల్సి ఉన్నా, ఒక్క రూపాయి విడుదల చేయలేదని, ఇటీవల ప్రజాప్రతినిధుల ఆటల పోటీలకు మాత్రం ప్రభుత్వం రూ.18 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. రూ.200 కోట్లు ఖర్చు పెట్టి మెస్సీతో ఒక్కరోజు ఫుట్బాల్ ఆడిస్తే క్రీడాకారులు కాలేరని ధ్వజమెత్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

