హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 14 ఎక్సైజ్ స్టేషన్లు 28న ప్రారంభంకానున్నాయి. రంగారెడ్డిలో రెండు, మెదక్ లో ఒక స్టేషన్ను మంత్రి ప్రారంభించనున్నారు. కొత్తగా ఏర్పాటు కానున్న బంజారాహిల్స్, చికడపల్లి, గండిపేట, కొండపూర్ , పెద్ద అంబర్పేట్, కూకట్పల్లి, అమీన్పూర్, హసన్పర్తి ఎక్సైజ్ స్టేషన్లకు అద్దె భవనాలను సైతం గుర్తించారు.
మారేడ్పల్లి, మీర్పేట్, కొంపెల్లి, కాప్రా, నాచారం, అల్వాల్ లో ఉన్న ఎక్సైజ్ స్టేషన్లలోనే కొత్త స్టేషన్లుగా గదులు వేరు చేసి విధులు నిర్వర్తిస్తారు. కొత్త స్టేషన్లకు ఇంచార్జీలుగా ప్రస్తుత ఎస్హెచ్ఓలే వ్యవహరిస్తారు.