హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): దేశ రాజధాని ఢిల్లీలో జరుగనున్న గణతంత్ర వేడుకలకు రాష్ట్రం నుంచి 138 మంది అతిథులు హాజరుకానున్నట్టు రక్షణ శాఖ శుక్రవారం తెలిపింది. వీరిలో వివిధ రంగాలకు, పలు ప్రభుత్వ శాఖలకు చెందినవారు ఉన్నట్టు వెల్లడించింది. ఈ అతిథులకు ఇప్పటికే అహ్వానాలు పంపినట్టు పేర్కొంది.