శంషాబాద్ రూరల్, డిసెంబర్ 16: వాతావరణం అనుకూలించకపోవడంతో మంగళవారం శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీ ఎయిర్పోర్టుకు వెళ్లాల్సిన 5 ఇండిగో విమానాలు, 2 ఎయిర్ఇండియా విమానాలను రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు.
దీంతోపాటు ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు రావాల్సిన 5 ఇండిగో విమానాలు, ఒక ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను రద్దు చేసినట్టు వెల్లడించారు.