హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూన్ 5న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నది. అదేవిధంగా మాజీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు సైతం నోటీసులు జారీచేసింది. జూన్ 6న హరీశ్‌రావు, 9న ఈటల రాజేం దర్ విచారణకు హాజరుకావాలని కోరింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణ లోపాలపై విచారణ కోసం జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కాళేశ్వరం కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే.
ఆ కమిషన్ ఇప్పటికే ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లతోపాటు డిజైనింగ్, డీపీఆర్, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించింది. కాగ్, విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికను సైతం కమిషన్ అధ్యయనం చేసింది. ఈ క్రమంలో అధికా రులు, ఆయా సంస్థలన్నీ గత ప్రభుత్వ పాలసీకి అనుగు ణంగా ప్రాజెక్టు పనులు చేపట్టినట్టు వెల్లడించినట్టు సమా చారం. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌ను సైతం విచారణ కు పిలవాలని కమిషన్ నిర్ణయించినట్టు తెలుస్తున్నది.
హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్ పేరు ప్రఖ్యాతులను దిగజార్చలేరని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఉపేంద్ర పేర్కొన్నారు. కేసీఆర్‌పై ఎవరు ఎలాంటి ఆరోపణలు చేసినా.. సూర్యునిపై ఉమ్మి వేయాలని అనుకోవడమే అవుతుందని దుయ్యబట్టారు.