బిజినేపల్లి, జూలై 17 : నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మహదేవునిపేటలో రైతుల వద్ద వ్యవసాయాధికారులు తనిఖీలు చేసి 111 బస్తాలు సీజ్ చేశారు. మరో 39 బస్తాలు పొలాల్లో చల్లుకోగా ఖాళీ సంచులను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ ఎరువులు ఎక్కడి నుంచి తెచ్చారన్న విషయాలపై ఆరా తీశారు. కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్ గ్రామానికి వెళ్లి పరిశీలించారు. రైతులు రాజు, బాలయ్య, రాములు, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, రాములు, మన్నెపురెడ్డి, జైపాల్‌రెడ్డికి కర్ణాటక నుంచి వచ్చిన కొందరు రూ.1,600- 1,700కు బస్తా చొప్పున విక్రయించినట్లు కలెక్టర్‌కు వివరించారు. ఎరువులను పరీక్షించి హైదరాబాద్‌కు తరలించి నివేదికల తర్వాత చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.