శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 02:45:51

ఖమ్మం జిల్లాకు 10వేల ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లు

ఖమ్మం జిల్లాకు 10వేల ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లు

  • రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ 

ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాకు పది వేల ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌ కిట్లను అందుబాటులోకి తెచ్చినట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. సోమవారం ఖమ్మం నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌తో కలిసి మంత్రి పువ్వాడ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా లక్షణాలు కలిగిన వారితోపాటు అత్యవసర వైద్యసేవల సమయంలో ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి లక్షణాలు కలిగిన వారు నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని మంత్రి కోరారు. కేంద్రాల్లో వైద్యసిబ్బంది పూర్తి జాగ్రత్తలు పాటించాలని, పరీక్షలకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించేలా చూడాలని వైధ్యాధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఖమ్మం మేయర్‌ పాపాలాల్‌, నగర పాలక సంస్థ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ మాలతి తదితరులు పాల్గొన్నారు. 


logo