హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్03, (నమస్తే తెలంగాణ) : ఎర్రగడ్డలోని ప్రభుత్వ మానసిక వైద్యశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఒక రోగి మృతిచెందగా, 70 మంది రోగులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రోగులకు సోమవారం అన్నం, అరటి పండ్లు, గుడ్లతోపాటు పరమాన్నాన్ని కూడా వడ్డించారు. సాయంత్రానికి డీసీ, కోర్టు వార్డుల్లోని కొంతమందికి స్వల్ప వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి.
వైద్యులు చికిత్స అందించినా కూడా డీసీ వార్డులో చికిత్స పొందుతున్న వ్యక్తి (30) తీవ్ర అస్వస్థతకు గురై మంగళవారం ఉదయం చనిపోయాడు. అస్వస్థతకు గురైన 70 మంది రోగుల్లో ఇద్దరి పరిస్థితి విషమించడంతో వెంటనే వారిని ఉస్మానియా జనరల్ దవాఖానకు తరలించి మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్నారు. రోగులకు మెరుగైన వైద్యమందించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి రాజనర్సింహ ఆదేశించారు.