అడవి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’. తెలుగు, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌కు సిద్ధమవుతున్నారు. ఈ నెల 27న ‘రుబారూ..’ అనే తొలి గీతాన్ని విడుదల చేయబోతున్నారు.
సోమవారం ఈ పాట తాలూకు కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. సినిమాలోని యాక్షన్ నేపథ్యానికి సమాంతరంగా చక్కటి ప్రేమకథ నడుస్తుందని మేకర్స్ తెలిపారు. మోసం, ప్రేమ, ప్రతీకారం ప్రధానాంశాలుగా సాగే ఇంటెన్స్ యాక్షన్ మూవీ ఇదని దర్శకుడు పేర్కొన్నారు. సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్ కీలక పాత్రను పోషిస్తున్నారు. భీమ్స్ స్వరకర్త. తెలుగు, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానుంది.