ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 14, 2020 , 09:32:46

రాష్ట్రంలో కొత్తగా 1,050 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 1,050 కరోనా కేసులు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో కరోనా మహమ్మారి వైరస్‌ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1050  పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 1,736 కోలుకొని డిశ్చార్జి అయ్యారు. నలుగురు మృత్యువాతపడ్డారు. ఇవాళ్టివరకు రాష్ట్రంలో 2,56,713 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  2,38,908 మంది చికిత్సకు కోలుకున్నారు.

మరో 16,404 మంది దవాఖానల్లో, హోంఐసోలేషన్‌లో 13,867 మంది చికిత్స పొందుతున్నారు. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ల కారణంగా ఇప్పటివరకు1,401 చనిపోయారు. ఇవాళ జీహెచ్‌ఎంసీ పరిధిలో 232 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌ జిల్లాలో 90, రంగారెడ్డి జిల్లాలో 75 కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.