బ్లాక్‌లో రెమ్‌డెసివర్ ఇంజక్షన్లు..ముగ్గురి అరెస్ట్
క్రైం న్యూస్ | రెమ్‌డెసివర్ ఇంజక్షన్స్ బ్లాక్ దందాపై మంచిర్యాల పోలీసులు కొరడా ఝులిపించారు.

మంచిర్యాల : రెమ్‌డెసివర్ ఇంజక్షన్స్ బ్లాక్ దందాపై మంచిర్యాల పోలీసులు కొరడా ఝులిపించారు. మంచిర్యాలలోని ప్రైవేట్ హాస్పిటల్స్ కేంద్రంగా అంబులెన్స్ డ్రైవర్ల ద్వారా సాగుతున్న దందా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
కరోనా బాధితుల వీక్ నెస్‌ను క్యాష్ చేసుకుంటూ మంచిర్యాలలోని రెండు ప్రైవేట్ దవాఖానలకు చెందిన ఇద్దరు సిబ్బంది, ఇద్దరు అంబులెన్స్ యజమానులు ఒక గ్రూపుగా ఏర్పడి నెల రోజులుగా బ్లాక్ దందా నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
ఒక్కో ఇంజక్షన్ ను రూ. 25 నుంచి రూ. 30 వేల వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని, అంబులెన్స్, 5 రెమిడెసివర్ ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
KTR | జనాభా లెక్కల ఆధారంగా మా గొంతు కోస్తే ఊరుకోం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
Rayapati | అనారోగ్యంతో మాజీ ఎంపీ రాయపాటి కన్నుమూత..!
Student Attempts Suicide | ర్యాగింగ్ వల్ల వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఐదుగురు సీనియర్లు సస్పెండ్
BRS | మహమ్మద్ తాజుద్దీన్ బాబా కుటుంబానికి రూ. 10లక్షలు ఆర్థిక సాయం
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

