శంషాబాద్, జనవరి 11: శంషాబాద్ విమానాశ్రయంలో మంగళవారం వేరువేరు విమానాల్లో దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు మహిళల నుంచి రూ.72.80 లక్షల విలువ చేసే 1,481 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు లోదుస్తుల్లో బంగారాన్ని దాచినట్టు అధికారులు తెలిపారు. ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు వివరించారు.