రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ బీజేపీ టికెట్ తుల ఉమకు ఇచ్చి.. చెన్నమనేని వికాస్‌రావుకు బీ-ఫామ్ ఇవ్వడంపై కుర్మ యువ చైతన్య నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం వేములవాడలోని తిప్పాపూర్‌లో ప్రధాని మోదీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి,
ఎంపీ బండి సంజయ్, ఈటల ఫొటోలతో కూడిన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్తామని చైతన్య సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేందర్ హెచ్చరించారు.
-వేములవాడ రూరల్