ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 10: తెలంగాణ గిరిజనులపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతున్నదని గిరిజన, స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు శ్రీనునాయక్ ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను సోమవారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజనుల రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ అసెంబ్లీ పంపిన తీర్మానాన్ని ఆమోదించకుండా కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. విభజన చట్టంలో పేర్కొన్న గిరిజన విశ్వవిద్యాలయాన్ని తొమ్మిదేండ్లయినా ప్రారంభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనునాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజనులను అన్ని రకాలుగా ఆదుకుంటున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి వర్సిటీ, కళాశాల నుంచి కమిటీలు వేసి ఈ పోస్టుకార్డు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాంనాయక్, బీఆర్ఎస్ నాయకులు జాన్సన్ రాథోడ్, డాక్టర్ రమణానాయక్ తదితరులు
పాల్గొన్నారు.