ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యం
నాణ్యమైన వైద్య ఆరోగ్య సేవలను మరింత చేరువ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజమైన ఆరోగ్య ప్రదాతగా అందరి హృదయాల్లో చెరుగని ముద్ర వేసుకుంటున్నారని విద్యు త్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన ప్రాంగణంలో కొత్తగా ఏర్పా టు చేసిన తెలంగాణ డయాగ్నస్టిక్ డిస్ట్రిక్ట్ హబ్‌ను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు.
- అన్ని రకాల వైద్య పరీక్షలకే టీ డయాగ్నస్టిక్ హబ్
- జిల్లా కేంద్రాల్లో అందుబాటులో 134 రకాల వైద్య పరీక్షలు
- మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడి
సూర్యాపేట టౌన్, జూలై 2 : నాణ్యమైన వైద్య ఆరోగ్య సేవలను మరింత చేరువ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజమైన ఆరోగ్య ప్రదాతగా అందరి హృదయాల్లో చెరుగని ముద్ర వేసుకుంటున్నారని విద్యు త్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన ప్రాంగణంలో కొత్తగా ఏర్పా టు చేసిన తెలంగాణ డయాగ్నస్టిక్ డిస్ట్రిక్ట్ హబ్‌ను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. సంపూర్ణ ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ దవాఖానల రూపురేఖలు మార్చి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న ట్టు తెలిపారు.
ఈ సేవలు యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని చెప్పారు. అందరికీ ఉచితంగా మెరుగైన వైద్య పరీక్షలు అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి పుట్టిందే తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ అని ఆయన పేర్కొన్నారు. వైద్యరంగంలో తెలంగాణ యావత్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని అన్నారు. చిన్న చిన్న పరీక్షలకు సైతం ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోకుండా ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన టీ డయాగ్నస్టిక్ హబ్ సౌకర్యాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరా రు.
ఈ కేంద్రంలో 134 వైద్య పరీక్షలను పూర్తిగా ఉచితంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. సూర్యాపేట జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు మరింత చేరువ కావడంతోపాటు మెడికల్ విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. తల్లీబిడ్డల సంరక్షణకు మాతా శిశు కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు అన్ని రకాల జబ్బులకు సంబంధించిన వైద్య సేవలను అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

