హైదరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీసీ అభ్యర్థి అయిన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు అవకాశం ఇవ్వడం పట్ల తెలంగాణ గౌడసంఘం హర్షం వ్యక్తం చేసింది. హిమాయత్ నగర్ లోని తెలంగాణ గౌడ సంఘం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంఘం నాయకులు మాట్లాడుతూ గెల్లు శ్రీనివాస్‌కు గౌడసంఘం సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. బీసీకి అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే హుజురాబాద్ ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్‌కు మద్దతుగా ప్రచారం చేస్తామని స్పష్టం చేశారు.
ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్లు నాచగొని రాజయ్య, ప్రతాప లింగం గౌడ్, అఖిల భారత గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేములయ్య గౌడ్, జాతీయ కార్యదర్శి మిద్దెల మల్లేశం గౌడ్, మహిళ వర్కింగ్ ప్రెసిడెంట్ చింతల పద్మ గౌడ్, సిటీ జనరల్ సెక్రెటరీ మందారం అనీల్ గౌడ్ పాల్గొన్నారు.