హైదరాబాద్ : యాదవులకు రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా విశేష ప్రాధాన్యత కల్పిస్తూ వారి అభివృద్ధికి చేయుతనిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు యాదవుల పక్షపాతి అని అఖిల భారత యాదవ మహాసభ ప్రకటించింది. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు అవకాశం కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది.
ఈ మేరకు అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బద్ధుల బాబురావు యాదవ్, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు చింతల రవీందర్ యాదవ్, ఉపాధ్యక్షుడు బాల మల్లేష్ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బి.శ్రీనివాస్ యాదవ్, పి.శ్రీహరి యాదవ్, జి.రాజారామ్ యాదవ్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎ. రమేశ్ యాదవ్, మహిళా విభాగం అధ్యక్షురాలు రాగం సుజాతయాదవ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం.మహేందర్ యాదవ్, గోవర్ధన్ యాదవ్, యశ్వంత్ యాదవ్ తదితరులు బుధవారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.
టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యాదవుల సంక్షేమానికి పెద్ద పీట వేసిందన్నారు. ముఖ్యంగా రెండో విడత గొర్రెల పంపిణీకి రూ. 6 వేల కోట్లువిడుదల చేయడంతో పాటు గొర్రెల యూనిట్‌ను రూ. 1.25 లక్షల నుంచి రూ. 1.75 లక్షలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. రాజకీయాల్లో యాదవులకు సముచిత స్థానం కల్పిస్తూ నాగార్జునసాగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థిగా యాదవ సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చి గెలుపు కోసం విశేషంగా కృషి చేశారని తెలిపారు.
హుజురాబాద్‌లో టీఆర్ఎస్ విద్యార్థి నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు అవకాశం కల్పించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. హుజురాబాద్‌లో అన్ని సంఘాలను కలుపుకుని తెరాస అభ్యర్థిని గెలిపించుకుంటామని ప్రకటించారు.