Dharma Reddy | కాంగ్రెస్‌కు ఓటు వేస్తే కష్టాలు తప్పవు : కల్యాణ్ కర్ణాటక రైతు సంఘం అధ్యక్షుడు ధర్మారెడ్డి
Dharma Reddy | తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కష్టాలు తప్పవని కల్యాణ్ కర్ణాటక రైతు సంఘం అధ్యక్షుడు ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం కర్ణాటక నుంచి జిల్లాకు చేరుకొని జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌లో కాంగ్రెస్ ఓటు వేయవద్దని రోడ్డుపై ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు.
జోగులాంబ గద్వాల : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కష్టాలు తప్పవని కల్యాణ్ కర్ణాటక రైతు సంఘం అధ్యక్షుడు ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం కర్ణాటక నుంచి జిల్లాకు చేరుకొని జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌లో కాంగ్రెస్ ఓటు వేయవద్దని రోడ్డుపై ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. కర్ణాటకలో ఐదు హామీలు ఇచ్చి వాటిని అమలు చేయక కాంగ్రెస్ ప్రభుత్వం చతికిల పడిపోయిందన్నారు.

రోడ్డుపై ధర్నా నిరసన వ్యక్తం చేస్తున్న ధర్మారెడ్డి, తదితరులు
ప్రస్తుతం ఆరు హామీలతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రజలను మోసం చేయడానికి వస్తుందని, వారు చెప్పే ఆరు హామీలు ఆరు నెలలు కూడా అమలులో ఉండవన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే రైతులతో పాటు ప్రజలకు గోస తప్పదని హెచ్చరించారు. కర్ణాటకలో పంటలు ఎండిపోతున్నా, రైతులు మరణిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. గతంలో ఉన్న ప్రభుత్వం 12 గంటల కరెంటు ఇస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మూడు గంటలు కూడా కరెంటు ఇవ్వకపోవడం వల్ల తమ పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కష్టాలు తప్పవని కల్యాణ్ కర్ణాటక రైతు సంఘం అధ్యక్షుడు ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం కర్ణాటక నుంచి జిల్లాకు చేరుకొని జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌లో కాంగ్రెస్ ఓటు వేయవద్దని రోడ్డుపై ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. pic.twitter.com/19opoOSNMp
— Namasthe Telangana (@ntdailyonline) October 24, 2023
Read Today's Latest Telangana-assembly-elections-2023 News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

