మెదక్ : బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి(MLA Padmadevender Reddy )అన్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన వార్డు మెంబర్ ఆకుల యాదగిరి తండ్రి వెంకట్, బిల్డింగ్ పైనుంచి కింద పడిన వడ్ల వెంకట్‌ను పరామర్శించారు. అన్ని విధాల అండగా ఉంటానని హామీనిచ్చారు. అంతకుముందు హవేలీ ఘనపూర్ మండలం కుచన్ పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్న ఎమ్మెల్యే
పార్టీలో చేరిన వారిలో దుర్గారి ఎల్లవ్వ, ఇర్ల కిషన్, తలారి సంజీవులు, అరిక రాములు, దుర్గారి రమేష్, లింగాల అనిల్, సంపత్, చింతకింది మల్లేశం, శతెల్లి శ్రీనివాస్, తొగిట వెంకట్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యా రెడ్డి, PACS చైర్మన్ హనుమంత్ రెడ్డి, మెదక్ మాజీ జెడ్పీటీసీ ఆంజనేయులు, బీఆర్ఎస్ నాయకులు మాణిక్య రెడ్డి, కొంపల్లి సుభాష్ రెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల సతీష్, గ్రామశాఖ అధ్యక్షుడు తోగిట మళ్లయ్య, తదితరులు పాల్గొన్నారు.