నల్లగొండ : జిల్లాలోని మునుగోడులో రేపు జరగనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ(CM KCR Praja Aashirvada Sabha) ఏర్పాట్లను పకలెక్టర్ ఆర్వీ కర్ణన్(Collector RV Karnan ), ఎస్పీ అపూర్వ రావుతో కలిసి పరిశీలించారు. హెలిప్యాడ్, బందోబస్త్ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు ఉండొద్దన్నారు. మునుగోడులో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద పరిస్థితిని సమీక్షించారు. అలాగే పలు వాహనాల తనిఖీలను పరిశీలించారు. ఎన్నికలు సమీస్తున్న తరుణంలో ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని, తనిఖీలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.