దేశవాళీలో ప్రతిష్టాత్మక లిస్ట్-ఏ క్రికెట్ టోర్నీ అయిన విజయ్ హజారేకు వేళైంది. ఈ నెల 24 నుంచి జనవరి 18 వరకూ జరుగబోయే 19 మ్యాచ్‌లకు అహ్మదాబాద్, రాజ్‌కోట్, జైపూర్, బెంగళూరు ఆతిథ్యమివ్వనున్నాయి.
జైపూర్ వేదికగా జరిగిన విజయ్ హజారే వన్డే టోర్నీలో హైదరాబాద్ జట్టు అదిరిపోయే బోణీ కొట్టింది. గురువారం మణిపూర్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.