2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం బుధవారం బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి డిజిటల్ పద్దును పార్లమెంట్‌కు సమర్పించనున్నారు.
కొత్త పద్దులో ఆరోగ్య సంరక్షణ, వైద్య రంగాలను చిన్నచూపు చూడవద్దని దేశంలోని మెజారిటీ ప్రజలు కోరుతున్నారు. కరోనా నేపథ్యంలో రాబోయే కేంద్ర బడ్జెట్‌పై గతంతో పోల్చితే ఈసారి భిన్నమైన అంచనాలే నెలకొన్నాయి మరి