తెలంగాణ ప్రజలలో సాంస్కృతిక చైతన్యాన్ని నింపిన సామాజిక సాహిత్యకారుడు, తెలంగాణా వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి అని తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జీ చిన్నారెడ్డి అన్నారు.
నల్లగొండ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సురవరం ప్రతాపరెడ్డి జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి బి.బాలమ్మ సురవరం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి స్ఫూర్తిని కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. సురవరం జయంతి సందర్భంగా ఆయన సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. సురవరం జయంతి �