హైదరాబాద్,మే 28 (నమస్తే తెలంగాణ): బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి స్ఫూర్తిని కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. సురవరం జయంతి సందర్భంగా ఆయన సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. సురవరం జయంతి ఉత్సవాలను ఏటా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని గుర్తు చేశారు.