తిరుమలలో (Tirumala) శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో మూడో రోజైన ఇవాళ ఉదయం శ్రీ మలయప్పస్వామి సింహ వాహనంపై యోగనరసింహుడి అలంకారంలో దర్శనమిచ్చారు.
తిరుమలలో అక్టోబర్ 4 నుంచి 12వరకు తొమ్మిది రోజులపాటు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఏడాది పొడువునా 450 ఉత్సవాలు నిర్వహిస్తుంది. ఇందులో బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్ఠత ఉన్నది. �
తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముస్తాబయింది. ఆదివారం రాత్రి బ్రహ్మోత్సవాలకు (Brahmotsavam) అంకురార్పణ చేయనున్నారు. దీంతో స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలు మొదలవుతాయి.