తిరుమల: తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముస్తాబయింది. ఆదివారం రాత్రి బ్రహ్మోత్సవాలకు (Brahmotsavam) అంకురార్పణ చేయనున్నారు. దీంతో స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలు మొదలవుతాయి. ఈ నెల 26 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. తొమ్మిది రోజులపాటు స్వామివారికి తిరుమల తిరువీధుల్లో ఉదయం, రాత్రి వేళల్లో వాహన సేవ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రేపటి నుంచి ఈ నెల 26 వరకు ఆర్జిత సేవలను టీటీడీ (TTD) రద్దుచేసింది. సోమవారం సాయంత్రం 6.15 నుంచి 6.30 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం జరుగుతుంది. అనతరం పెద్దశేష వాహన సేవతో బ్రహ్మోత్సవాల వాహన సేవలు ప్రారంభమవుతాయి.