ఆర్కేపురం డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, కలిసికట్టుగా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మూడు రోజుల సేవా కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వృద్దాశ్రమంలో దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు.