Ashtalakshmi Temple | ఆర్కే పురం, ఏప్రిల్ 30 : మహేశ్వరం నియోజకవర్గం ఆర్కే పురం డివిజన్ వాసవి కాలనీలోని అష్టలక్ష్మి దేవాలయంలో 29వ ఇష్టి సహిత బ్రహ్మోత్సవములలో భాగంగా మూడవ రోజు వైశాఖ శుద్ధ తదియ బుధవారం రోజున నృసింహ ఇష్టి, సూర్య ప్రభ వాహనసేవ, గజవాహన సేవ, చంద్రప్రభ వాహన సేవ, ఎదురుకోలు ఉత్సవాలను నిర్వహించినట్లు ఆలయ చైర్మన్ సోమ సురేష్ కుమార్, ఫౌండర్ చైర్మన్ గౌరీశెట్టి చంద్రశేఖర్ గుప్తాలు తెలియజేశారు.
ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహచార్యులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గంప జగన్, కోశాధికారి అయిత అంజయ్య, కమిటీ సభ్యులు దాచేపల్లి శ్రీనివాసు, గౌరీశెట్టి అరుణ్ కుమార్, చిలుక ఉపేందర్ రెడ్డి, ఉమాపతిరావు, సుదర్శన్, గ్రంథి రమేష్, మాలే శ్రీనివాస్, సత్యనారాయణ, మాలే శ్రవణ్, శ్రీధర్, రామ్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.