ఆర్కేపురం/మహేశ్వరం, అక్టోబర్ 18: ఆర్కేపురం డివిజన్లోని కుర్తాళం పీఠం వారాహి సమేత ప్రత్యంగిరా పరమేశ్వరి దేవాలయంలో దేవీ శరన్నవరాత్రులు వైభవంగా జరుగుఆర్కేపురం డివిజన్లోని కుర్తాళం పీఠం వారాహి సమేత ప్రత్యంగిరా పరమేశ్వరి దేవాలయంలో దేవీ శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతి రోజు వందలాది మహిళలు అమ్మవారిని దర్శించుకొని కుంకుమార్చన పూజల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారులు సోమేశ్ కుమార్ సతీమణి జ్ఞానముద్ర అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈతున్నాయి. బుధవారం అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతి రోజు వందలాది మహిళలు అమ్మవారిని దర్శించుకొని కుంకుమార్చన పూజల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారులు సోమేశ్ కుమార్ సతీమణి జ్ఞానముద్ర అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ సెక్రటరీ అమ్మవారి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో విట్టల్శర్మ, అరుణ, జయశ్రీ, రూప, పద్మావతి, హేమ, శ్రీపతిశర్మ తదితరులు పాల్గొన్నారు.
ఖిల్లా మైసమ్మ దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభంగా జరుగుతున్నాయి. శ్రీకాంత్‌గౌడ్ ఆధ్వర్యంలో నెలకొల్పిన దుర్గామాతను సామాజిక సేవా వేత్త చిలుక ఉపేందర్‌రెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకొని ప్రత్యక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జ్ఞానేశ్వర్ యాదవ్, శేఖర్ ముదిరాజ్, శ్రీకాంత్‌రెడ్డి, విప్లవ్, నాగేశ్, విజయ్, రాజు, అనిల్, కుమార్, శివసాయి, అఖిల్ తదితరులు ఉన్నారు.
మహేశ్వరంలోని శివగంగ దేవాలయంలో అన్నపూర్ణాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పూజల అనంతరం మధ్యాహ్నం అనితామధుసూదన్ దంపతులు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కరోళ్ల ప్రియాంక రాజేశ్, చైర్మన్ నిమ్మగూడెం సుధీర్‌గౌడ్, ఎంపీటీసీ సుదర్శన్‌యాదవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆనందం, పాలక మండలి సభ్యులు కరోళ్ల చంద్రయ్య ముదిరాజ్, పేయల యాదమ్మ, బాల్‌రాజ్, వెంకటేశ్, రవి, మహేందర్, మాజీ చైర్మన్లు నవీన్, కుమార్, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్, రాములు, ఈవో మురళీకృష్ణ, పూజారులు, తదితరులు పాల్గొన్నారు.