అంతర్జాతీయ అనిశ్చితితో దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. జూలై 21తో ముగిసిన వారంలో ఈ నిల్వలు 1.987 బిలియన్ డాలర్లమేర క్షీణించి 607.035 బిలియన్ డాలర్ల వద్దకు పడిపోయాయి.
Foreign Exchange | గత కొన్ని వారాలుగా తగ్గుతూ వచ్చిన విదేశీ మారకం నిల్వలు మళ్లీ పుంజుకున్నాయి. ఈ నెల 14తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 12.743 బిలియన్ డాలర్లు పెరిగి 609.022 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
దేశ ఆర్థిక వృద్ధికి ప్రధాన సంకేతాల్లో ఒకటైన ఎగుమతులు నత్తనడకన సాగుతున్నాయి. గత నెలలోనూ పెరుగుదలకు నోచుకోలేకపోయాయి. కీలకమైన ఇంజినీరింగ్, రత్నాలు-ఆభరణాల రంగాల్లో నీరసం కనిపిస్తున్నది.
అధిక ద్రవ్యోల్బణంతో కూనరిల్లుతున్న అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కారణంగా ఓ వైపు విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు దేశం నుంచి తరలివెళ్లడం, మరోవైపు రూపాయి విలువ పతనంకావడంతో భారత్ వద్దనున్న విదేశీ మారక నిల్�