అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్(ఏబీఆర్ఎస్ఎం) జాతీయ సమావేశాలు ఆదివారం నుంచి రాజస్థాన్లోని జైపూర్లో జరగనున్నట్టు తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి సురేశ్ తెలిపారు.
స్కూల్ టీచర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్టీఎఫ్) 9వ జాతీయ మహాసభలు శుక్రవారం కోల్కతాలో ప్రారంభమయ్యాయి. మూడురోజులపాటు జరుగనున్న ఈ రజతోత్సవ వేడుకలకు తెలంగాణ నుంచి 38 మంది ప్రతినిధులు హాజరయ్యారు.