హైదరాబాద్, జనవరి 21 (నమస్తేతెలంగాణ): ఈ నెల 24 నుంచి 28 వరకు హైదరాబాద్లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభలు నిర్వహించనున్నట్టు ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ అరుణజ్యోతి, మల్లు లక్ష్మి తెలిపారు. తెలంగాణలో జాతీయ మహాసభలు నిర్వహించడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్లో వారు మీడియాతో మాట్లాడారు.
24న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహిస్తామని, 25న ఆర్టీసీ కల్యాణ మండపంలో సభలు ప్రారంభమవుతాయని చెప్పారు. మధ్యా హ్నం భారీ ర్యాలీ నిర్వహిస్తామని, సాయంత్రం 5 గంటలకు బహిరంగసభ జరుగుతుందన్నారు. 28వ తేదీ మధ్యాహ్నం మహాసభలు ముగుస్తాయని వారు వివరించారు. దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఐద్వా ఆధ్వర్యంలో మహిళా ఉద్యమాలు చేపడుతామని తెలిపారు.